BRS Working Presedent | హైదరాబాదీల చైతన్యానికి పాదాభివందనం చేస్తున్నా
BRS Working Presedent | హైదరాబాదీల చైతన్యానికి పాదాభివందనం చేస్తున్నా
బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి
Hyderabad : రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర ప్రజలు చూపించిన చైతన్యానికి తాను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నగరంలోని మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క సీటు ఇతర పార్టీలకు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం చాలా గొప్ప విషయమని కేటీఆర్ మెచ్చుకున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శనివారం పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ చేరిన సందర్భంగా ఆయన ఈ విధంగా మాట్లాడారు.
ప్రస్తుత హైదరాబాద్ ప్రజల చైతన్యానికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో కొందరు మోసపోయారు., కానీ నగరం వాళ్లు మాత్రం మోసపోలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెసోళ్ల మాటలు, వ్యవహారం తెలుసు కాబట్టి 24 నియోజక వర్గాల్లో తమ చైతన్యాన్ని చూపించారన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పశ్చాత్తాప పడే రోజు వస్తందని, రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయన్నారు. అలాగే కేటీఆర్ మాట్లాడుతూ.. తమరు గెలిపించిన ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడే తప్ప.. తమరు తప్పు చేయలేదన్నారు. తమరు ఇప్పటికీ పార్టీని వెన్నంటే ఉన్నారన్నారు. పార్టీలో శనివారం కార్తీక్ రెడ్డి పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
తమ అందరితో చెప్పే ప్రార్థన ఒక్కటే.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున కొట్లాడి. ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకునే అరుదైన అవకాశం కలుగుతుందన్నారు. ఆ అవకాశం కార్తీక్ రెడ్డికి వచ్చిందన్నారు. ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే.. అంత మేలు జరుగుతుందని, కార్తీక్ రెడ్డి మూసీ ప్రాజెక్టు వల్ల ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. దాదాపు ఐదు. ఆరు వందల కుటుంబాలను కలిశామని, హిందూ ముస్లిం అనే తేడా లేకుండా, తమకు ఎవరు మేలు చేస్తారో.. ఎవరు చేయరో అర్థం.. అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 ఏండ్ల నుంచి ఇండ్లు కట్టుకున్నామని, కాని ఇప్పుడు మాత్రం కబ్జాదారులు అని అంటున్నారు అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకలా పన్నులు కట్టంగా కూడా ఆ రోజున దొంగలు, ఆక్రమణదారులు అని బదనామ్ చేస్తున్నారని వారు వాపోయారు. బంగారం లాంటి భూమిని విడిచిపెట్టి పోవాలని కాంగ్రెసోళ్లు బెదిరిస్తున్నారని, కోట్ల ఆస్తి తమ పిల్లలకు ఉండిపోతది అని భావిస్తే.. ఈ దుర్మార్గుడు ఇట్లా చేస్తాడు అని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారని కేటీఆర్ తెలిపారు.
* * *
Leave A Comment